నాగర్‌కర్నూల్: జిల్లాలో జనగణన–2027 ప్రక్రియను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ గర్వంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, డీపీఓ సుజాతతో కలిసి ఆయన జనగణన వివరాలను వెల్లడించారు.
డిజిటల్ విధానంలో తొలిసారి: కరోనా కారణంగా వాయిదా పడిన జనగణన ఇప్పుడు డిజిటల్ విధానంలో ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ప్రజలు తమ మొబైల్, కంప్యూటర్ లేదా ట్యాబ్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చని (Self Enumeration) సూచించారు. "వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత 11 అంకెల SE ID లభిస్తుంది. గణన అధికారి ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీ చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ స్వీయ గణన చేయని పక్షంలో అధికారులు నేరుగా ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారు" అని ఆయన వివరించారు.
అపోహలు వద్దు - భద్రతపై హామీ: జనగణనపై వస్తున్న పుకార్లను కలెక్టర్ ఖండించారు. రేషన్ కార్డులు, పింఛన్లు లేదా ప్రభుత్వ లబ్ధిదారుల ఎంపికకు జనగణనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో ఆస్తులు, ఆధార్ లేదా ఇంటి నంబర్ల గురించి ప్రశ్నలు ఉండవని, కేవలం ప్రాథమిక వివరాలు మరియు ఇంటి సౌకర్యాల గురించి మాత్రమే సమాచారం సేకరిస్తామని తెలిపారు. వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని, ఎక్కడికీ లీక్ కాదని హామీ ఇచ్చారు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం: జిల్లాలోని 20 మండలాలు, 460 గ్రామాలు, 4 మున్సిపాలిటీల్లో 2500 మంది సిబ్బందితో ఈ ప్రక్రియ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. మే 11 నుండి జూన్ 9 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారుల వంటి అభివృద్ధి ప్రణాళికలకు ఈ గణాంకాలు అత్యంత కీలకమని, సర్వేలో సహకరించకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు ముందుండి స్వీయ గణన చేసి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com