> అంగన్వాడీలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆగ్రహం - విధుల్లో అలసత్వం వద్దు!
> అచ్చంపేట అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సమీక్ష.
> టీచర్లు, ఆయాలు ప్రతిరోజూ అందుబాటులో ఉండాలి - ఎమ్మెల్యే ఆదేశం.
> గర్భిణీలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందాలి.
అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అచ్చంపేట డివిజన్ పరిధిలోని సిడిపిఓ (CDPO)లు మరియు అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందుతుందా లేదా అని ఆరా తీశారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ప్రతిరోజూ కేంద్రాలలో అందుబాటులో ఉండాలని, పిల్లల హాజరు మరియు ప్రీ-స్కూల్ విద్య అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సూపర్వైజర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, విధుల్లో ఏమాత్రం అలసత్వం వహించినా శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. అంగన్వాడీలు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలకమని, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
MLA Dr. Chikkudu Vamsi Krishna Reviews Anganwadi Services in Achampet
Achampet: Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna held a crucial review meeting with Anganwadi Supervisors and Child Development Project Officers (CDPOs) at his camp office today. The meeting focused on the functioning of Anganwadi centers, nutrition distribution for pregnant women and infants, and the implementation of pre-school education across the Achampet division.
During the session, the MLA emphasized that supervisors and CDPOs must conduct daily field visits to monitor the centers effectively. He warned of stringent disciplinary action against staff found negligent in their duties. He insisted that Anganwadi teachers and helpers must be present at the centers regularly and ensure that health check-ups and nutritional goals are met. Dr. Vamsi Krishna stated that the government is committed to reaching every beneficiary and instructed officials to bring any local issues to higher authorities' notice immediately.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com