బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా భరత్ ప్రసాద్ పోతుగంటి నియామకం: నియామక పత్రం స్వీకరణ

24, Sep 2025 Achampet 176 Views
భరత్ ప్రసాద్ పోతుగంటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియామకం

హైదరాబాద్:

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు గారు కీలక నియామకం చేపట్టారు. బీజేపీ యువ నాయకుడు భరత్ ప్రసాద్ పోతుగంటి గారిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందించారు.

మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారి గారి సమక్షంలో భరత్ ప్రసాద్ పోతుగంటి గారు తన నియామక పత్రాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారు మాట్లాడుతూ.. భరత్ ప్రసాద్ పోతుగంటి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారని, ఆయనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భరత్ ప్రసాద్ పోతుగంటి గతంలో వివిధ హోదాలలో పార్టీకి సేవలు అందించారు.

నియామక పత్రం స్వీకరించిన అనంతరం భరత్ ప్రసాద్ పోతుగంటి గారు మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారికి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను పూర్తి చిత్తశుద్ధితో నిర్వర్తించి, తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TAGS: Bharat Prasad Pothuganti BJP Secretary, Telangana BJP Appointments, N Ramchander Rao, Chandrashekhar Tiwari, BJP Telangana State Secretary, Bharat Prasad Pothuganti, BJP Telangana State Secretary, N Ramchander Rao BJP, Chandrashekhar Tiwari Ji, BJP Telangana leadership, Telangana BJP appointments, state party secretary BJP, political news Telangana, Nagarkurnool district BJP news, Achampet constituency political updates, BJP organizational news, Telangana party leadership, BJP Telangana executive, party appointments India, BJP Telangana updates

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com