అచ్చంపేట పశువుల సంతలో వసూళ్లు - మేకకు రూ. 200 బాదుడు.

10, Jan 2026 Achampet 176 Views

అచ్చంపేట పశువుల సంతలో ‘సంక్రాంతి’ బాదుడు : మేకకు రూ. 200 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లు!

- ప్రశ్నిస్తే కొనుగోలుదారులపై దురుసు ప్రవర్తన - మున్సిపల్ అధికారులు జోక్యం చేసుకోవాలని బాధితుల డిమాండ్

అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల కేంద్రంలోని పశువుల సంతలో సంక్రాంతి పండుగ వేళ గొర్రెలు, మేకలకు ఉండే గిరాకీని ఆసరాగా చేసుకుని సంత కాంట్రాక్టర్లు కొనుగోలుదారులనుడి నిలువుదోపిడీ చేస్తున్నారు.

ధరల మోత.. వసూళ్ల కోత: సంక్రాంతి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మంది ప్రజలు మేకలు, గొర్రెలను కొనుగోలు చేసేందుకు సంతకు తరలివస్తున్నారు. అయితే, అమ్మకందారులు ధరలు అమాంతం పెంచేయడంతో చేసేదేమీ లేక సామాన్యులు భారీ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది చాలదన్నట్టు, సంతను వేలంలో దక్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రతి మేకపై రూ. 200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది చాలా ఎక్కువని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దురుసు ప్రవర్తనపై ఆగ్రహం: ఈలా వసూలు చేస్తున్న ఈ డబ్బుల గురించి ప్రశ్నించిన వారిపై కాంట్రాక్టర్లు మరియు వారి సిబ్బంది అత్యంత దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొనుగోలుదారులను బెదిరింపులకు గురిచేస్తూన్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక పురపాలక సంఘం (మున్సిపాలిటీ) అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు స్పందించి, సంతలో ధరల పట్టిక బోర్డును ఏర్పాటు చేయాలనీ కొనుగోలుదారులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

TAGS: Achampet Cattle Market, Goat Prices Sankranti 2026, Achampet Municipality News, Nagarkurnool Livestock News, Achampet cattle market, Sankranti goat prices, Achampet market contractors, ₹200 per goat charge, livestock market exploitation, Telangana cattle market news, Achampet municipality action, Sankranti festival livestock sales, goat and sheep market Achampet, farmer buyer harassment, market lease contractors abuse, Nagarkurnool district cattle market, rural market corruption, Telangana agriculture news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com