బసవేశ్వరుడి ఆశయాలను ఆచరిద్దాం.. ఆదర్శ సమాజాన్ని నిర్మిద్దాం: కలెక్టర్ సంతోష్ నాయక్

20, Apr 2026 Achampet 176 Views
Nagarkurnool Collector and MLA paying tributes to Sri Basaveshwara Swamy at the Collectorate.

బసవేశ్వరుడి ఆశయాలను ఆచరిద్దాం.. ఆదర్శ సమాజాన్ని నిర్మిద్దాం: జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ నాయక్

నాగర్ కర్నూల్: వర్ణ వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంస్కర్త శ్రీశ్రీశ్రీ బసవేశ్వర స్వామి అని, ఆయన ఆశయాలను ఆచరించడం ద్వారానే ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ నాయక్ అన్నారు. బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బసవేశ్వర స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తో పాటు నాగర్ కర్నూల్ శాసనసభ్యులు శ్రీ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి హాజరై బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వందల సంవత్సరాల క్రితమే బసవేశ్వరుడు సామాజిక చైతన్యం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు.

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. బసవేశ్వరుడి లక్ష్యాలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో బసవేశ్వరుడి విగ్రహ ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సురేంద్ర, బీసీ కార్పొరేషన్ అధికారి రామ్ నాయక్, తెలంగాణ మేదరీ మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి రమాకాంత్, లింగాయత్ సమాజం అధ్యక్షులు గిరిజా శంకర్, కార్యదర్శి రాజేష్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా మేదరి మహేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు కోన తిరుపతయ్య, కౌన్సిలర్లు, బీసీ కార్పొరేషన్ సిబ్బంది మరియు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

TAGS: Basaveshwara Jayanti Nagarkurnool, Basaveshwara celebrations Telangana, Nagarkurnool collector Santosh Naik speech, Basaveshwara ideals social reform India, Telangana BC welfare department event, Nagarkurnool MLA Rajesh Reddy news, Basaveshwara statue demand Nagarkurnool, Telangana social harmony event, Lingayat community Basaveshwara Jayanti, Nagarkurnool district latest news, Telangana government celebrations news, Basaveshwara tribute program Telangana, BC community event Nagarkurnool, Telangana cultural event news, Nagarkurnool local news today

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com