చోరీ చేసిన హుండీ నగదును నెల తరవాత అనంతపురంలోని ఆలయంలో తిరిగి తెచ్చి పెట్టిన దొంగలు..

05, Sep 2025 Achampet 176 Views

అపహరించిన హుండీ నగదును ఆలయంలో తిరిగి పెట్టిన దొంగలు: క్షమించమంటూ లేఖ

అనంతపురం:

దేవుడి సొమ్ము దొంగలించినందుకు పశ్చాత్తాపపడిన దొంగలు, నెల రోజుల తర్వాత చోరీ చేసిన హుండీ నగదును తిరిగి ఆలయానికి తెచ్చిపెట్టిన అసాధారణ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే... అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న ప్రముఖ ముసలమ్మ ఆలయం హుండీని నెల క్రితం కొందరు దొంగలు ఎత్తుకెళ్లారు. తాజాగా, గురువారం రాత్రి దొంగలు ఆ హుండీ నగదు మొత్తాన్ని తిరిగి ఆలయంలో తెచ్చి పెట్టి వెళ్లారు.

తిరిగి ఉంచిన నగదుతో పాటు దొంగలు ఒక లేఖను కూడా వదిలి వెళ్లారు. "తప్పయింది అమ్మా, నలుగురం కలిసి దొంగతనం చేశాం. దీనివల్ల నా కొడుకు అనారోగ్యం బారిన పడ్డాడు. కొంచెం డబ్బు వాడుకున్నాను. దయచేసి క్షమించండి,” అని ఆ లేఖలో పేర్కొన్నారు.

హుండీలో వదిలి వెళ్లిన మొత్తం నగదు రూ. 1,86,486 (రూపాయలు లక్షా ఎనభై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆరు) గా ఉన్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. చోరీ చేసిన సొమ్ము తిరిగి రావడంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నలుగురు దొంగలు కలిసి ఈ దొంగతనం చేసినట్లు లేఖ ద్వారా వెల్లడైంది.

TAGS: Anantapuram Hundi Theft, Thieves Return Cash, Musalamma Temple, Bukkarayasamudram, Forgiveness Letter, Andhra Pradesh Crime News, Stolen Money Returned, Musalamma Temple theft, Musalamma Temple Anantapuram, Bukkarayasamudram temple news, stolen hundi amount returned, ₹1,86,486 hundi money, temple theft Andhra Pradesh, thieves return stolen money, apology note thieves, son illness reason theft, temple hundi news, Anantapuram district news, Andhra Pradesh crime news, unusual crime story, religious faith news, temple donation news, human interest story India

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com