మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వేదికగా ఆదివారం ‘జన సమయం’ నూతన మ్యాగజిన్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ మరియు వనపర్తి కేంద్రాలుగా వెలువడుతున్న ఈ మ్యాగజిన్, ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు సాగాలని వక్తలు ఆకాంక్షించారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) వ్యవస్థాపకులు మంగళగిరి యాదగిరి ఈ మ్యాగజిన్‌ను లాంచనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రికా రంగంలో ఒక మహిళా ఎడిటర్ (సంధ్య) పత్రికను నడిపేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ‘జన సమయం’ ప్రజల అభిమానాన్ని చూరగొని, జనహితం కోసం పాటుపడాలని ఆయన ఆకాంక్షించారు.
రాజకీయ, సామాజిక మరియు అభివృద్ధి అంశాలను దృష్టిలో ఉంచుకుని వార్తా కథనాలు ఉండాలని, తద్వారా పత్రిక భవిష్యత్తులో మంచి గుర్తింపు పొందుతుందని పలువురు సీనియర్ జర్నలిస్టులు సూచించారు. ఈ కార్యక్రమంలో టీ డబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ డాక్టర్ బండి విజయకుమార్, సీనియర్ జర్నలిస్టు ఏముల నర్సింలు, జన సమయం పత్రిక ఎండి పృథ్వి కుమార్ రెడ్డి, మరియు పలు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం నాయకుడు మైత్రి యాదయ్య, ఎమ్మార్పీఎస్ నేత బోయపల్లి నర్సింలు సహా పలువురు ప్రముఖులు ఎడిటర్ సంధ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com