జూబ్లీహిల్స్ గెలుపు మా బాధ్యతను పెంచింది - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

14, Nov 2025 Achampet 176 Views
హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ మీడియా తో చిట్ చాట్...

జూబ్లిహిల్స్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ ను అఖండ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. పీసీసీ నాయకత్వ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఏకతాటిపై నిలిచి, ఐక్యంగా పని చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తి ఆపలేదని ఈ ఫలితాలు రుజువు చేశాయి. ఈ గెలుపు కార్యకర్తలకు అంకితం.

ఈ గెలుపు హైదరాబాద్ నగర అభివృద్ధి పట్ల, ఇక్కడ పేదల సంక్షేమం పట్ల మా బాధ్యతను మరింత పెంచింది.

రెండేళ్లుగా నగరాభివృద్ధికి సంబంధించిన మెట్రో విస్తరణ, మూసీ నది ప్రక్షాళన, ఫోర్త్ సిటీ నిర్మాణం, రీజినల్ రింగ్ రోడ్డు వంటి మా ఆలోచన, విజన్, కార్యచరణకు ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఆమోదం తెలిపారు. వచ్చే మూడేళ్లు ఆ దిశగా నిరంతరం పని చేయడానికి ఈ ఎన్నికల ఫలితాలు మాకు సరికొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చాయి.

ఎన్నికలప్పుడే రాజకీయం. వచ్చే మూడేళ్లు అభివృద్ధి, పేదల సంక్షేమమే మా మంత్రం.

జూబ్లిహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి ఇక మా బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం. ఈ గెలుపునకు ప్రధాన భూమిక పోషించిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచింది. నెగ్గితే ఉప్పొంగిపోవడం, ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్‌ పార్టీకి తెలియదు., GHMC ఎన్నికల్లోనూ ఇదేరకమైన ఫలితాలు సాధిస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. గత రెండేళ్లుగా ప్రజలు నిశితంగా గమనించి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును బాధ్యతగా తీసుకుని ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి అభివృద్ధి చేస్తాం. రీజినల్‌ రింగ్‌రోడ్‌, రేడియల్ రోడ్స్‌, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనతో అభివృద్ధికి బాటలు వేస్తున్నాం. చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా చర్యలు చేపట్టాం. సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. హైడ్రా, ఈగల్‌ ఫోర్స్‌ వంటి సంస్థలను ప్రజలకు మేలు చేయడానికి తీసుకొచ్చాం. కేంద్ర నిధులు రాబట్టుకునే విషయంలో కిషన్‌రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి

TAGS: CM Revanth Reddy, Naveen Yadav Jubilee Hills, Jubilee Hills Byelection Results, Hyderabad Development Congress, Metro Expansion Musi Rejuvenation, GHMC Elections Congress, CM Revanth Reddy Jubilee Hills Victory, Jubilee Hills Bypoll Naveen Yadav, Hyderabad Development Vision, Metro Expansion Musi RRR, Revanth Reddy GHMC Elections, Ensure CM Revanth Reddy, Jubilee Hills by-election, Naveen Yadav, and Hyderabad Development are, Jubilee Hills by-election result, CM Revanth Reddy statement, Jubilee Hills Congress victory, Naveen Yadav win, Telangana bypoll results, Congress party Telangana, Revanth Reddy speech, mandate for development, Hyderabad political news, Jubilee Hills election news, Congress leadership unity, Telangana government performance

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com