నాగర్‌కర్నూల్: జిల్లాలో జనగణన–2027 ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో స్వీయ గణన (Self Enumeration) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ఆన్‌లైన్ ద్వారా అధికారికంగా ప్రారంభించారు. తామే స్వయంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మే 10 వరకు అవకాశం: ఈ స్వీయ గణన కార్యక్రమం ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుంది. ప్రజలు https://se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ వ్యక్తిగత మరియు కుటుంబ వివరాలను డిజిటల్ విధానంలో సులభంగా నమోదు చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేని వారి కోసం గ్రామ మరియు వార్డు స్థాయిల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం..: ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఖచ్చితమైన జనాభా గణాంకాలు అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజలందరూ బాధ్యతగా ఈ స్వీయ గణనలో పాల్గొని ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరారు. ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమాచారం అత్యంత భద్రంగా ఉంటుందని, ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని హామీ ఇచ్చారు. అనంతరం స్వీయ గణనపై అవగాహన గోడపత్రికలను ఆవిష్కరించారు. నమోదు పూర్తి చేసిన వారు ఇతరులను ప్రోత్సహించేలా తమ ఇళ్ల వద్ద ఈ పోస్టర్లను అతికించాలని సూచించారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com