భవిష్యత్ స్వేచ్ఛా భారతంలో దళితులు రాజ్యాధికారాన్ని పంచుకోవాలి: కాన్పూర్ సభలో డా. అంబేద్కర్ (1944)

06, Oct 2025 Achampet 176 Views

Vol. 17 Part in..Pg 306-307

1944 వ సంవత్సరం జనవరి 31వ తేదీన కాన్పూరులో జరిగిన షెడ్యూల్డ్ కులాల మహాసభలో, డాక్టర్ అంబేడ్కర్ స్వాగతిస్తూ మూడు సంస్థలు ప్రసంగించాయి. ఈ స్వాగతోపన్యాసాలకు స్పందిస్తూ, డాక్టర్ అంబేడ్కర్ భవిష్యత్తులో తమ కులాల కర్తవ్యాన్ని నిర్దేశించారు. షెడ్యూల్డ్ కులాల సమాఖ్యకు సంస్థాగతమైన బలాన్ని చేకూర్చాలని, అందువలన ఏ పార్టీగానీ, చివరకు బ్రిటిష్ ప్రభుత్వం కూడా రాజ్యాంగ నిర్మాణంలో తమ ప్రాముఖ్యతను గుర్తించ నిరాకరించడానికి వీలు లేదని అన్నారు.

భవిష్యత్ స్వేచ్ఛా భారతంలో మనం రాజ్యాధికారాన్ని సాధించాలని తీర్మానించు కోవాలి మనం ఎవరికీ విధేయులుగానూ, దాసులుగానూ ఉండబోమని తీర్మానించుకోవాలి" అని ప్రకటించారు. స్వతంత్ర భారతదేశంలో హిందువులు ముస్లింలు - దళితులు (షెడ్యూల్ కులాలు)ముగ్గురూ రాజ్యాధికారాన్ని పంచుకోవాలి.ప్రతి కార్మికుడికి కనీసం రోజుకు ముప్పై రూపాయల వేతనం, గృహవసతి, వృద్ధాప్య పెన్షన్, భీమా సౌకర్యం ఏర్పడే రోజు తప్పకుండా వస్తుంది". తనను కాంగ్రెస్ లో చేరమని సూచించిన విమర్శకులకు ఆయన నేను భారతదేశంలో దళితుల స్వేచ్ఛకు ఎక్కువ ప్రాముఖ్యం యిస్తాను. వారు దాదాపు సంవత్సరాలకు పైగా అణిచివేతకు గురై ఉన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పనిచెయ్యడం కంటే నా వర్గం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడం నా ప్రాధమ్యం" అని చెప్పారు.

సంవత్సరాల పైబడి తాను అనుభవిస్తున్న వేదనకి గల కారణాలు గూర్చి లోతుగా ఆలోచించమని ఆయన అన్నారు. "దీనికి ముఖ్య కారణం హిందూ ధర్మం. ప్రపంచంలో ఏ ఇతర మతంలోనూ లేని విధంగా హిందూమతం కులవివక్షనూ, అస్పృశ్యతనూ పాటిస్తోంది హిందువులు ఈ ముసుగులోనే దళితులపై అన్యాయాలను జరుపుతున్నారు. ఈ నాటికీ గ్రామాల్లో దళితులు మర్యాదగా జీవించలేకపోతున్నందుకు విచారిస్తున్నాను. అందువలన, నేను నొక్కి చెప్పేదేమిటంటే, దళితులు హిందుత్వాన్ని విడిచి పెట్టి. వారు అమలు చేస్తున్న అమర్యాదని ఇంకేమాత్రం సహించకూడదు. నన్నెంతో బాధించే విషయం ఏమిటంటే ఇంకా తమపై హిందువులు సాగిస్తున్న పెత్తనాన్ని అవమానాలనీ దళితులు సహిస్తుండడం. తాము ఎవరికీ తక్కువ కాదని గ్రహించి, స్వశక్తి కూడదీసుకుని, దానిపై ఆధారపడాలి.

దళిత సమాఖ్య (షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్) అనే తమ రాజకీయ సంస్థకు బలాన్ని చేకూర్చుకోవాలి. బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడూ ముస్లింల పై సానుభూతి చూపడానికి సిద్ధంగా ఉంటుంది. జైలు నుంచి విడుదలయిన తరువాత కాంగ్రెసు నాయకులు ముస్లిం నాయకులతో 50-50 ఒప్పందం కుదుర్చుకుంటే అప్పుడు దళితుల పరిస్థితి ఏమిటి? రాజ్యాధికారాన్ని పంచుకోవాలంటే, ముందే ఒక సంస్థ సంఘటితం అయితేనే మన హక్కుల కోసం విజయవంతంగా పోరాడగలం

మన కృషిని సాంద్రీకృతం చెయ్యాలంటే, స్త్రీల సహకారం మనకి చాలా అవసరం. ప్రతి పట్టణంలోనూ, గ్రామంలోనూ మన సందేశాన్ని వినిపించడానికి స్వచ్చంధ దళాలను తయారుచేయాలి. నగరాలకు 200 మైళ్ళ దూరానికి కూడా మన సందేశం అందాలి. ఇందుకు స్త్రీల తోడ్పాటు ఎంతో విలువైనది. దళితులంతా అంతర్గత విభేదాలను విస్మరించి తమ బాధ్యతను గుర్తెరిగి కృషి చెయ్యాలి. మనం ఇతరులను అస్పృశ్యత రద్దు కోరేటప్పుడు, మనలో మనకున్న విభేదాలను సరిదిద్దుకోవాలి .

  రెండు రోజులు సాగిన సభలు అంతటితో ముగిసినట్లు శ్రీ శివరాజ్ ప్రకటించారు. అంబేడ్కర్ ప్రసంగం ముగియగానే సభ హర్షధ్వానాలతో మారుమోగింది.

సేకరణ : అరియ నాగసేన బోధి

సౌజన్యం : హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించిన "భారతదేశంలో బౌద్ధ మతం" పుస్తకం పేజీ నెంబర్ 46,47
 
జై భీమ్, జై బుద్ధ,,జై భారత్, జై మూలవాసి 

పాత్కూల శ్రీశైలం అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ అధ్యక్షుడు అచ్చంపేట 

TAGS: Dr. Ambedkar Kanpur Speech 1944, Scheduled Castes Conference, Scheduled Castes Federation SCF, Ambedkar on Untouchability, Dalit Political Power, Hindu Dharma Caste System, Free India Politics, Dr B R Ambedkar Kanpur speech 1944, Scheduled Castes Conference Kanpur, Ambedkar historic address, SCF strengthening Ambedkar, rejection of Hinduism untouchability, political power sharing Ambedkar, Dalit rights movement India, Ambedkar ideology, Scheduled Castes Federation, Ambedkar social justice speech, women cooperation Ambedkar, caste discrimination India history, Ambedkar reform movement, Indian social reform history

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com