నల్లమల టూరిజం అభివృద్ధికి రూ. 100 కోట్లు: సీఎంఓ ప్రకటన

12, Dec 2025 Achampet 176 Views
నల్లమలను టూరిజం హబ్‌గా మార్చడమే లక్ష్యం: రూ. 100 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక!...

నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్:

నల్లమల అటవీ ప్రాంతాన్ని దేశంలోనే ప్రముఖ టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అచ్చంపేట స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేసిన వినతి మేరకు, నల్లమల టూరిజం అభివృద్ధికి రూ. 100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుండి ప్రకటన విడుదలైంది.

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 19, 2025న నాగర్‌కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, మాచారం గ్రామంలో "ఇందిర సౌర గిరి జల వికాసం" పథకం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నల్లమల ప్రాంతాన్ని టూరిజం హబ్‌గా మార్చాలని వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే వినతికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. వెంటనే నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో రూ. 100 కోట్లను కేటాయించే ప్రతిపాదన సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రతిపాదన సర్కిల్ (Proposal Circular) కూడా విడుదల చేయబడింది.

రూ. 100 కోట్లతో అభివృద్ధి చేయనున్న ప్రధాన పర్యాటక ప్రాంతాలలో ముఖ్యమైనవి:

  1. శ్రీ ఉమామహేశ్వరం దేవస్థానం
  2. మద్దిమడుగు దేవస్థానం
  3. మల్లెల తీర్థం
  4. వ్యూ పాయింట్‌లు
  5. తదితర ప్రాంతాలు

త్వరలోనే ఈ టూరిజం హబ్‌కు సంబంధించిన ప్రణాళికలు, టెండర్లు, నిధుల విడుదల మొదలైన పనులు జరగనున్నాయి. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌తో ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోనున్నాయి. నల్లమలను టూరిజం హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి నల్లమల ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

TAGS: Nallamala Tourism Hub, Rs 100 Crore Development, MLA Vamsikrishna, CM Revanth Reddy, Umamaheswaram Temple, Mallelatheertham, Ambrabad Tourism, Nallamala tourism, Nallamala tourism development, Nallamala ₹100 crore plan, CMO announcement Nallamala, MLA Vamsikrishna, Achampet MLA Vamsikrishna, Telangana tourism development, Nallamala forest tourism, Umamaheswaram temple, Sri Umamaheswaram temple, Mallelatheertham, Mallelatheertham waterfall, Maddimadugu temple, Maddimadugu waterfalls, Nallamala temples tourism, pilgrimage tourism Telangana, eco tourism Nallamala, spiritual tourism Telangana, temple tourism development, Telangana government tourism plan, Chief Minister Office Telangana, Achampet constituency development, Nallamala pilgrimage circuit, Telangana heritage tourism, forest tourism Telangana, temple development scheme, tourism infrastructure Nallamala, Telangana tourism news, Achampet MLA request, Nallamala development projects
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com