వాటవర్లపల్లి/అమ్రాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై వాటవర్లపల్లి సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. ఆమనగల్ గ్రామానికి చెందిన రమేష్ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం నుండి హైదరాబాద్‌కు కారులో వెళ్తుండగా, కారు అదుపుతప్పి బోల్తా పడింది.
అదే సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కే. శివప్రసాద్, బీట్ ఆఫీసర్ సరిత, డ్రైవర్ ఖాదర్ ప్రమాదాన్ని గమనించి క్షణాల్లో ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న బాధితులను అత్యంత జాగ్రత్తగా బయటకు తీసి, తమ పెట్రోలింగ్ వాహనంలో తరలించారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, గుండం బేస్ క్యాంప్ వద్ద బాధితులను అంబులెన్స్ సిబ్బందికి అప్పగించి తమ ఉదారతను చాటుకున్నారు.
ఈ ప్రమాదంలో ఒక మహిళ చేయి విరగగా, ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆపద సమయంలో వేగంగా స్పందించి ప్రాణరక్షణ చర్యలు చేపట్టిన శివప్రసాద్, సరిత, ఖాదర్‌లను అటవీ శాఖ ఉన్నతాధికారులు మరియు స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com