బలమూరు/కొండనాగుల: భారతీయ సంస్కృతికి నిలువుటద్దాలైన హస్తకళలను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు, యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని బల్మూరు మండల విద్యాధికారి (MEO) విష్ణుమూర్తి ఆకాంక్షించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొండనాగుల గ్రామంలో కేంద్ర ప్రభుత్వ హస్తకళల విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 'క్రాఫ్ట్ డిమానిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాం' శుక్రవారం ఘనంగా ముగిసింది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విష్ణుమూర్తి గారు మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు భారతీయ హస్తకళలు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. విద్యార్థులకు బాల్యం నుండే వీటిపై అవగాహన కల్పించడం వారి సృజనాత్మకతను పెంచుతుందని తెలిపారు.
మాతృభూమి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్ ప్యారసాని రమాకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి:
నైపుణ్యాభివృద్ధి: గ్రామీణ యువతలో స్కిల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.
ఆర్టిసన్ కార్డులు: హస్తకళల విభాగం ఆఫీస్ ఇంచార్జ్ అశోక్ మాట్లాడుతూ.. అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు (ID Cards) మంజూరు చేస్తామని, బ్యాంకుల ద్వారా రుణాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ వర్క్‌షాప్‌లో సుమారు 70 మంది విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు.
శిక్షణ: ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, కౌచ్లెస్, కేన్ & బ్యాంబు (వెదురు) కళలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పోటీలు: రెండో రోజున హస్తకళల విశిష్టతపై వ్యాసరచన మరియు పెయింటింగ్ పోటీలు నిర్వహించారు.
బహుమతులు: పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు మరియు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరబ్రహ్మం, ప్రసాద్, రమేష్ నాయక్, ట్రైనర్స్ వెంకటమ్మ, పద్మ, గౌతమ్, లక్ష్మమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
TAGS: Handicrafts Workshop Kondanagula, MEO Vishnumurthy, Matrubhoomi Society RamaKanth, Skill Development Telangana, Handicrafts Training for Students, Kondanagula ZPHS craft program, 3-day handicraft awareness, MEO Vishnumurthy speech, rural students handicraft benefits, economic impact of handicrafts, craft demonstration Telangana, student skill development programs, ZPHS Kondanagula events, rural entrepreneurship education, Telangana school programs, handicraft training for students, vocational education Telangana
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com