లింగాల మండల కేంద్రంలోని 2వ వార్డు ప్రజలు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న తీవ్ర తాగునీటి కొరతకు ఉపశమనం లభించింది. ఈ ప్రాంత ప్రజల దాహం తీర్చేందుకు, అచ్చంపేట నియోజకవర్గం గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శంకర్ రాథోడ్ గారు చొరవ తీసుకున్నారు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు గారి ఆదేశాల మేరకు శంకర్ రాథోడ్ గారు తక్షణమే స్పందించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేకసార్లు ఈ తాగునీటి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోయారు. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా పాలనలో... ఎమ్మెల్యే వంశీకృష్ణ మరియు రంగినేని శ్రీనివాస్ రావు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లిన వెంటనే, ప్రజల కష్టాలను గుర్తించి త్రాగునీటి బోరును ఏర్పాటు చేయించారు.
ప్రజల కష్టసుఖాలలో తోడుండి, సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ గారికి మరియు సహకరించిన నాయకులు రంగినేని శ్రీనివాస్ రావు, శంకర్ రాథోడ్ గారికి 2వ వార్డు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
TAGS: Lingala Water Problem, Shankar Rathod Borewell, MLA Vamshikrishna, Rangineni Srinivas Rao, Achampet Drinking Water, Girijan Employees Association, Achampet MLA Dr Vamshikrishna, MLA Vamshikrishna instructions, Girijan Employees Association, Shankar Rathod, drinking water borewell installation, Lingala 2nd Ward, water scarcity resolved, safe drinking water Telangana, public welfare works, community development Lingala, Nagarkurnool district news, rural water supply Telangana, government initiative water, people’s issues resolved, Achampet constituency development
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com