కార్తీక మాస క్యాలెండర్: ఏ తిథి రోజున ఏ పూజ చేయాలి? సంప్రదాయాలు ఇవే!

18, Oct 2025 Achampet 176 Views

కార్తీకమాసంలో ఏ తిథి రోజున ఏం చేయాలి? విధానాలు తెలుసుకుందా..!

దీపావళి మరుసటిరోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం కానీ ఈసారి మనకు ఒకరోజు లేటుగా మొదలైంది సోమవారం దీపావళి బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుంది. అన్ని మాసాల్లో కెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి.

న కార్తీక సమో మాసో

న శాస్త్రం నిగమాత్పరమ్ |

నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః||

అంటే కార్తీక మాసంలోని ప్రతీ రోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది.

ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో తెలుసుకుందాం.

 

కార్తీక శుద్ధ పాడ్యమి :

తెల్లవారుజామునే లేచి, స్నానం చేసి, గుడికి వెళ్లాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి, సంకల్పం చెప్పుకొని, ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి.

విదియ : సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటివారికి యమగండం తప్పుతుందంటారు.

తదియ : అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి.

చవితి : నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. పుట్టలో పాలు పోయాలి.

పంచమి : దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది.

షష్ఠి : ఈరోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతానప్రాప్తి కలుగుతుంది.

సప్తమి : ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయుఃవృద్ధి ప్రాప్తిస్తుంది.

అష్టమి : ఈరోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు.

నవమి : నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

దశమి : నేడు రాత్రిపూట విష్ణుపూజ చేయాలి.

ఏకాదశి : దీన్నే బోధనైకాదశి అంటారు. ఈరోజున విష్ణుపూజ చేస్తే సద్గతులు కలుగుతాయి.

ద్వాదశి : ఈరోజు క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణుపూజ చేసి, దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది.

త్రయోదశి : సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి.

చతుర్దశి : పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది.

కార్తీక పూర్ణిమ :

కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈరోజున నదీస్నానం చేసి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈరోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలూ తొలగిపోతాయి.

కార్తీక బహుళ పాడ్యమి : ఆకుకూర దానం చేస్తే మంచిది.

విదియ : వనభోజనాలు చేయడానికి అనువైన రోజు.

తదియ : పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి.

చవితి : రోజంతా ఉపవాసం చేసి, సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి.

పంచమి : చీమలకు నూకలు చల్లడం, శునకాలకు అన్నం పెట్టడం మంచిది.

షష్ఠి : గ్రామదేవతలకు పూజ చేయాలి.

సప్తమి : జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి.

అష్టమి : కాలభైరవాష్టకం చదివి, గారెల దండను భైరవుడికి (శునకం) సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది.

నవమి : వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి, పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు.

దశమి : అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి, కోరికలు తీరుతాయి.

ఏకాదశి : విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

ద్వాదశి : అన్నదానం లేదా స్వయంపాకం సమర్పిస్తే శుభం.

త్రయోదశి : ఈరోజున నవగ్రహారాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి.

చతుర్దశి : ఈరోజున మాస శివరాత్రి. కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగుతాయి.

అమావాస్య : పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి..స్వస్తి..

TAGS: Karthika Masam Significance, Hindu Calendar Rituals, Lord Shiva Vishnu Puja, Karthika Purnima 2025, Vanabhojanam Dates, Karthika Masam rituals guide, Karthika Masam Padami to Amavasya, Ksheerabdhi Dwadashi significance, Karthika Purnima importance, Karthika Masam pooja vidhanam, daily charities Karthika Masam, Hindu vratams Karthika month, Kartika deepam rituals, Karthika Masam vrat rules, spiritual significance of Karthika Masam, Telugu Hindu festivals, Karthika month puja details

 

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com