అచ్చంపేటలో 220/33 కేవీ సబ్ స్టేషన్‌కు హామీ: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన ఎమ్మెల్యే వంà°

28, Aug 2025 Achampet 176 Views

అచ్చంపేటలో 220/33 కేవీ సబ్ స్టేషన్‌కు గ్రీన్ సిగ్నల్: ఉప ముఖ్యమంత్రి హామీ

అచ్చంపేట:

అచ్చంపేట నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా ముందడుగు పడింది. నియోజకవర్గంలో 220/33 కేవీ సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ గారు ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారిని కలిశారు.

పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు మరియు ఇతర కార్యక్రమాలపై చర్చించడానికి ఉప ముఖ్యమంత్రిని కలిసిన వంశీకృష్ణ.. వాటికి సంబంధించిన అనుమతులు, నిధులు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వానాకాలం పనులకు నిధులు మంజూరు కోరిక:

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్ల మరమ్మతులు కోసం, అలాగే కొత్తగా హై లెవెల్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయుటకు అవసరమైన అనుమతులు, నిధులు తక్షణమే మంజూరు చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరారు.

సబ్‌ స్టేషన్‌కు ఉప ముఖ్యమంత్రి హామీ:

ఎమ్మెల్యే వంశీకృష్ణ విజ్ఞప్తులపై ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు సానుకూలంగా స్పందించారు. అచ్చంపేట నియోజకవర్గానికి అత్యంత అవసరమైన 220/33 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే పరిపాలన అనుమతులు ఇచ్చి, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిద్దామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 220/33 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుతో నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా నాణ్యత మెరుగుపడి, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలు తీరనున్నాయి.

TAGS: Achampet Substation, 220/33 KV, Bhatti Vikramarka, MLA Vamshikrishna, Power Substation Telangana, High-Level Bridge Funds, Achampet News, Achampet MLA Dr Vamshikrishna, Dr Vamshikrishna meeting Deputy CM, Bhatti Vikramarka, Deputy CM Telangana, Telangana government meeting, 220/33 KV substation proposal, new power substation Achampet, electricity infrastructure Telangana, pending development projects Achampet, bridge repairs Telangana, culvert repairs heavy rains, rain damage constituency, Achampet constituency development, Nagarkurnool district news, Telangana power department, monsoon damage repairs, government funds request, infrastructure development Telangana

 

 

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com