రిజర్వేషన్ లేకుంటే రాష్ట్రం అగ్నిగుండం: బీసీ నాయకులు - సీఎం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్
కల్వకుర్తి: చట్ట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గం కేంద్రంలో బీసీ నాయకులు 'బీసీ రిజర్వేషన్ సాధన దీక్ష' చేపట్టారు. రిజర్వేషన్ అనేది బీసీల హక్కు అని వక్తలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యమాల ద్వారానే న్యాయం ఈ దీక్షలో బీసీ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే అఖిలపక్ష నాయకులను ప్రధానమంత్రి వద్దకు తీసుకొని వెళ్లి, పార్లమెంట్లో చట్టం ద్వారా బీసీ రిజర్వేషన్‌ను సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాల ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బాలాజీ సింగ్ ఠాగూర్ గారు అన్నారు.
ప్రభుత్వంపై విమర్శలు కాంగ్రెస్ పార్టీ చేయవలసిన విధంగా అన్ని చేసిందని, ఇక బీజేపీ పార్లమెంట్‌లో చట్టం చేసి 9వ షెడ్యూల్‌లో పెట్టాలని కల్వకుర్తి మాజీ సర్పంచ్ ఆనందు గారు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రికి బీసీలకు న్యాయం చేసే ఇష్టం లేదని, ఒకవేళ ఉంటే మంత్రి పదవులలో, కార్పొరేషన్ పదవులలో, బడ్జెట్ నిధుల కేటాయింపులలో బీసీలకు న్యాయం చేసేవారని బీసీ జాక్ కన్వీనర్ కొమ్ము శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ కల్పించక పోతే రాష్టం అగ్నిగుండం అవుతుందని కార్మిక నాయకుడు మణికంఠ హెచ్చరించారు.
దీక్ష విరమణ ఈ కార్యక్రమంలో బీసీ జాక్ నాయకులు సదానందం, రాజేందర్, కునుగుల జంగయ్య, సిఐటియు నాయకుడు ఆంజనేయులు, బీఎస్పీ నాయకుడు గడ్డమీది వెంకటయ్య, ఎంఆర్‌పిఎస్ నాయకుడు వీరస్వామి, విద్యార్థి సంఘం నాయకుడు భాస్కర్ ప్రజాపతి, జాగృతి నాయకుడు దారమోని గణేష్, బీసీ మహాసభ నాయకుడు అనిల్ గారు మరియు ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్, పీసీబీ మెంబర్ బాలాజీ సింగ్ ఠాగూర్ గారు నిమ్మరసము ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
TAGS: BC Reservation, 42% Quota, Local Body Elections, Kalwakurthy, BC JAC, Balaji Singh Thakur, Political Protest, Telangana BC Rights, BC Reservation Sadhana Deeksha, Kalwakurthy BC Leaders News, Balaji Singh Thakur, 42% BC Reservation, Local Body Elections Telangana, Kommu Srinivas Yadav, BC Reservation Sadhana Deeksha, Kalwakurthy BC protest, 42 percent BC reservation, Backward Classes reservation Telangana, BC local body elections, BC JAC Kalwakurthy, Kommu Srinivas Yadav, Balaji Singh Thakur, BC rights movement, Telangana BC reservation demand, all-party delegation to Prime Minister, BC reservation Act of Parliament, social justice for BCs, Telangana political protest, BC community rights
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com