నేడు ప్రపంచం సాంకేతికతతో పరుగులు పెడుతోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్, కళ్ల ముందు ఇంటర్నెట్, క్షణాల్లో సమాచారం.. అంతా వేగం. కానీ, ఈ వేగంలో మనం ఏదో ఒక అమూల్యమైన దాన్ని కోల్పోతున్నాం. అదే.. మన "పెద్ద తరం". విలువలకు నిలువుటద్దంలా, ఆప్యాయతలకు చిరునామాగా నిలిచిన ఒక అద్భుతమైన తరం ఇప్పుడు ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ కనుమరుగవుతోంది.
ఆ తరం గురించి తలచుకుంటేనే హృదయం తడిసి ముద్దవుతుంది. నేటి తరం గూగుల్ మ్యాప్స్‌లో దారి వెతుక్కుంటుంటే, ఆ తరం GPS లేకున్నా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగింది. నేడు మనకు ఎన్ని డిగ్రీలు ఉన్నా ప్రశాంతత లేదు, కానీ ఆ తరం వారికి డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన గొప్ప అనుభవం ఉంది.
ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు, కానీ మనసులను కలిపే స్నేహ సంభాషణలకు లోటు లేదు. ఏసీలు, కూలర్లు లేకున్నా ఆరుబయట వెన్నెల్లో హాయిగా నిద్రించిన అనుభూతి ఆ తరానిది. మినరల్ వాటర్ తెలియదు.. చెరువు నీళ్లు, బావి నీళ్లు తాగినా వందేళ్లు ఆరోగ్యంగా బతికిన గట్టి తరం అది. పిజ్జాలు, బర్గర్లు లేవు.. కానీ పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా గడిపారు.
ఆ తరం ప్రత్యేకత ఏమిటంటే.. 'నేను' అనకుండా 'మనం' అంటూ బతకడం. ఉమ్మడి కుటుంబాల నీడన, ఆస్తుల కన్నా ఆప్యాయతలకు విలువనిస్తూ అందరినీ కలుపుకుపోయిన తరం అది. క్రమశిక్షణ విషయంలో రాజీ పడేవారు కాదు. స్కూల్లో మాస్టారు నాలుగు దెబ్బలు వేస్తే, ఇంటి దగ్గర తల్లిదండ్రులు మరో పది వేసి క్రమశిక్షణ నేర్పేవారు.
జిమ్‌లకు వెళ్లకుండానే బండెడు చాకిరీ చేసి చెమటను చిందించారు. అందుకే వారికి బీపీలు, షుగర్లు, హార్ట్ ఎటాక్‌లు దరిచేరలేదు. రాత్రిపూట ఇంటి అరుగుల మీద కబుర్లు చెప్పుకుంటూ, లాంతర్ల వెలుగులో జీవితాలను వెలిగించుకున్నారా మహానుభావులు. ఆడంబరాలకు దూరంగా, కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన ఆ తరం నిజంగా మన సంస్కృతికి ప్రతిరూపం.
నేడు మనం కరెంట్ దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటున్నాం. ప్రకృతితో సహజీవనం మర్చిపోయి యాంత్రిక జీవనం వైపు పరుగులు తీస్తున్నాం. ఆ తరం వాళ్లు మనకు నేర్పింది మానవత్వం. వారి నుంచి ఈ తరం విలువలు, నిజాయితీ, ఓర్పును నేర్చుకోకపోతే మన భవిష్యత్తు అంధకారమే అవుతుంది.
"వాళ్లు మనకు నేర్పింది ప్రకృతితో సహజీవనం.. మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం. ఆలోచిద్దాం.. మార్పు చెందుదాం!"
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com