అచంపేటలో మీడియా సమావేశం
అచంపేట కేంద్రంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కుందేళ్ళ శంకర్ యాదవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత పది రోజుల నుండి వట్టే జానయ్య యాదవ్ కుటుంబంపై కావాలని అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
అగ్రకుల నాయకుల కక్షసాధింపు చర్యలు
యాదవ బిడ్డగా నల్గొండ జిల్లాలో రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక అగ్రకుల పాలకులు, నాయకులు కక్షగట్టి వట్టే జానయ్య యాదవ్‌పై మరియు ఆయన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని శంకర్ యాదవ్ విమర్శించారు. బిసి మరియు యాదవ నాయకుల ఎదుగుదలను అనగదొక్కాలని చూస్తే అంతకంటే ఉవ్వెత్తున పైకి వస్తామని స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యుల అరెస్టులపై ఆందోళన
బెంగళూరులో MBBS చదువుతున్న జానయ్య యాదవ్ చిన్న కుమారుడిపై కూడా కేసులు పెట్టి, అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో తెలియజేయడం లేదని ఆయన ఆరోపించారు. అలాగే పెద్ద కుమారుడిని అరెస్ట్ చేయడంతో పాటు, జానయ్య భార్యకు బెయిల్ వచ్చినా మళ్లీ రీ-అరెస్ట్ చేస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టపరమైన విచారణ జరపాలి
"ఏదైనా సమస్య ఉంటే జానయ్య యాదవ్‌ను చట్టపరంగా విచారించాలి గానీ, కుటుంబ సభ్యులను వేధించడం సరికాదు. ఉమ్మడి జిల్లాలో ఎంతమంది అగ్రకుల నాయకులకు రైస్ మిల్లర్లు లేవు? వారిపై ఎందుకు విచారణలు చేపట్టడం లేదు?" అని ఆయన ప్రశ్నించారు. నాటి ప్రభుత్వం 79 కేసులు పెడితే, నేటి ప్రభుత్వం కూడా ఇబ్బందులు పెడుతోందని దుయ్యబట్టారు.
పోలీసులకు విజ్ఞప్తి – ప్రభుత్వంపై హెచ్చరిక
తెలంగాణ రాష్ట్ర పోలీసులు వెంటనే వట్టే జానయ్య యాదవ్ ఎక్కడున్నారో, అలాగే ఆయన ఇద్దరు కుమారులను ఎక్కడ ఉంచారో స్పష్టం చేయాలని శంకర్ యాదవ్ డిమాండ్ చేశారు. మా ఓట్లతో గెలిచి మాపైనే ప్రతాపం చూపిస్తే రానున్న రోజుల్లో గద్దె దించడం ఖాయమని, అక్రమ కేసులు ఉపసంహరించుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు, బిసి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే మల్లేష్ యాదవ్, కొమ్ము వెంకట యాదవ్, ఈశ్వర్ యాదవ్, శ్రీశైలం యాదవ్, రాజబాబు యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Vatte Janaiah Yadav, Achampet Press Meet, Kundella Shankar Yadav, Jathiya Yadava Hakkula Porata Samithi, Nagarkurnool District News, Vatte Janaiah Yadav Illegal Cases, Nalgonda Yadava Association, Telangana BC Leaders News, Achampet Yadava Samithi Media Meet, Vatte Janaiah Family Arrests, Telangana Police Illegal Cases Allegations, Achampet Local Politics, BC Leaders Struggle Telangana, Nagarkurnool News Today, Nalgonda Vatte Janaiah Case Updates
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com