పర్యాటక రంగానికి ‘రూట్‌ మ్యాప్‌’: 8 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మంత్రి జూపల్లి కసరత్తు

08, Jun 2026 Achampet 176 Views
Jupally Krishna Rao Launches Master Plan for 8 Tourism Hubs in Telangana

తెలంగాణ పర్యాటక రంగానికి నూతన 'రూట్ మ్యాప్'.. 8 ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపై మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా.. తొలి దశలో ఎంపిక చేసిన 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను ఆకర్షణీయమైన ప్రపంచ స్థాయి గమ్యస్థానాలుగా మార్చేందుకు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్ల’ రూపకల్పనపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టి సారించారు. సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ఆర్కిటెక్చరల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లతో ఆయన సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యాటకులు కేవలం ఒక ప్రాంతాన్ని సందర్శించి వెళ్లిపోయేలా కాకుండా, అక్కడి ప్రకృతి, చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు స్థానిక జీవనశైలిని ఆస్వాదిస్తూ ఒక విభిన్నమైన మరపురాని అనుభూతిని (Experience) పొందేలా ‘స్లో టూరిజం’ను ప్రోత్సహించాలని దిశానిర్దేశం చేశారు.

మొదటి దశలో అభివృద్ధి చేసే 8 ప్రాంతాలు: ప్రతిపాదిత 27 ప్రాంతాలలో మొదటి దశ కింద ఈ క్రింది 8 క్లస్టర్లను ఎంపిక చేసి, వాటి భౌగోళిక, చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాలని మంత్రి స్పష్టం చేశారు:

సోమశిల – అలంపూర్

  1. వికారాబాద్

  2. వరంగల్ – రామప్ప

  3. నాగార్జునసాగర్

  4. యాదాద్రి – పోచంపల్లి

  5. ఆదిలాబాద్ గిరిజన క్లస్టర్

  6. భద్రాచలం

  7. కాళేశ్వరం

భువనగిరి, సోమశిలపై ప్రత్యేక ఫోకస్: ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన టూరిజం మోడల్స్, ముఖ్యంగా కేరళలోని 'జటాయు' ప్రాజెక్ట్ తరహా విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. భువనగిరి కోట ప్రాంతం కేరళ జటాయు ప్రాజెక్ట్ కంటే పెద్దదని, అక్కడ దేశంలోనే అత్యుత్తమ హెరిటేజ్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే, సోమశిల–అలంపూర్ సర్క్యూట్‌లో కృష్ణా బ్యాక్‌వాటర్స్ ఆధారంగా క్రూయిజ్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, వెడ్డింగ్ డెస్టినేషన్లు, మరియు జటప్రోలు మదనగోపాలస్వామి ఆలయం వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను అనుసంధానం చేయాలని ఆదేశించారు.

ఈ మాస్టర్ ప్లాన్లు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి కల్పనకు కీలక శక్తిగా మారాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, ఎండీ గౌతమి, డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

TAGS: Telangana Tourism Policy, Telangana Tourism Development, Minister Jupally Krishna Rao, Telangana Tourism News, Telangana Tourist Places, Vikarabad Tourism, Somashila Alampur Tourism, Warangal Ramappa Tourism, Nagarjuna Sagar Tourism, Yadadri Pochampally Tourism, Adilabad Tribal Tourism, Bhadrachalam Tourism, Kaleshwaram Tourism, Telangana Master Plan Tourism, Heritage Tourism Telangana, Adventure Tourism Telangana, Slow Tourism Telangana, Telangana Travel Destinations, Telangana Tourism Projects, Hyderabad Tourism News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com