తెలంగాణలో పంటల మార్పిడి తప్పనిసరి - రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

25, May 2026 Achampet 176 Views
Telangana Farmers Commission to Submit Final Report on Crop Rotation

తెలంగాణలో పంటల మార్పిడి తప్పనిసరి.. తుది నివేదిక సిద్ధం చేస్తున్న రైతు కమిషన్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పంటల మార్పిడి విధానం, భవిష్యత్ వ్యవసాయ ప్రణాళికలు మరియు రైతుల ఆదాయాభివృద్ధికి సంబంధించిన తుది నివేదికను రూపొందించే పనిలో రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ నిమగ్నమైంది. ఈ అంశంపై హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో వివిధ రంగాల నిపుణులు, రిటైర్డ్ ఉన్నతాధికారులతో మే 25 న ఒక విస్తృత స్థాయి ఉన్నత సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న పంటల విధానం, నీటి లభ్యత, భూసార పరిస్థితులు, మార్కెట్ డిమాండ్, మరియు రైతుల ఆర్థిక స్థితిగతులపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా ఉద్యాన పంటల విస్తరణ, మిల్లెట్లు, పప్పు దినుసుల సాగును ప్రోత్సహించడం, సాగు ఖర్చులను తగ్గించే సాంకేతిక పద్ధతులపై రైతులకు శిక్షణ ఇవ్వడం వంటి విషయాలపై నిపుణులు పలు విలువైన సూచనలు చేశారు.

ఉద్యాన పంటలు, మిల్లెట్ సాగు పడిపోవడంపై ఆవేదన: గత పదేళ్ల కాలంలో తెలంగాణలో ఉద్యాన వన పంటలు, మిల్లెట్ సాగు ఘననీయంగా పడిపోయిందని కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు కేవలం వరి, పత్తి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల వైపే వస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఏకపక్ష సాగు విధానం వల్ల భూసారం దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే రాష్ట్రంలో పంటల మార్పిడి (Crop Rotation) తప్పనిసరిగా మారిందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉందని, రైతులు అటువైపు మళ్లాలని కోరారు. ఈ సమావేశంలో వచ్చిన సిఫారసులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదికను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కమిషన్ ప్రతినిధులు తెలిపారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్, కేవీఎన్ రెడ్డి, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, మరికంటి భవానీ రెడ్డిలతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అజేయ కల్లం, వి. నాగిరెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి, మాజీ వీసీ పి. రాఘవరెడ్డి తదితర ప్రముఖులు హాజరై తమ సూచనలు అందించారు.

TAGS: Hyderabad vaarthalu, Telangana vyavasaaya vaarthalu, Telangana raithu sankhshema commission, pantala maarpidi Telangana, Telangana vyavasaaya vidhaanam, M Kodandareddy, millet saagu Telangana, udyana pantalu Telangana, Telangana raithula aadayam, Hyderabad vyavasaaya sameeksha samaavesham, Telangana pantala pranalika, Telangana vyavasaaya abhivrudhi, raithu sankhshemam Telangana, vyavasaaya nipunula samaavesham, Telangana prabhutva vyavasaaya vidhaanam, millet saagu demand, sthiramaina vyavasaayam Telangana, Telangana pantala vaividhyam, Hyderabad vyavasaaya samaavesham, Telangana breaking news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com