అచ్చంపేట: విద్యలో పెరిగిపోతున్న అసమానతలను తొలగించి, ప్రతి ఒక్కరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించేందుకు 'కామన్ స్కూల్ విద్యావిధానం' అమలు కోసం ప్రజలందరూ ఉద్యమించాలని ప్రొఫెసర్ జి. విజయ్ పిలుపునిచ్చారు. పాలమూరు అధ్యయన వేదిక నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాట యోధుడు, ప్రముఖ సామాజికవేత్త దివంగత పడాల బాలజంగయ్య 4వ వర్ధంతి సభ అచ్చంపేట ఆదర్శనగర్‌లోని ఆయన స్వగృహం (అమ్మబడి ప్రాంగణం) నందు నిర్వహించారు.
పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో పి.బి. స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రొఫెసర్ జి. విజయ్, డాక్టర్ జిలుకర శ్రీనివాస్, ఎం. రాఘవాచారి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ జి. విజయ్ మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రస్తుతం విద్య ఒక వ్యాపార వస్తువుగా మారిందని, మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించే సరుకుగా మార్చడం ఆందోళనకరమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశంలో కామన్ స్కూల్స్ ఉండేవని, అన్ని వర్గాల పిల్లలు ఒకే పాఠశాలలో చదివే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విద్యను సామాజిక మార్పుకు ప్రధాన సాధనంగా గుర్తించారని, ప్రైవేటీకరణ, మనువాదం మరియు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలు చైతన్యంతో పోరాడాలని కోరారు.
సామాజిక అసమానతలు తొలగే వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందే: డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశంలో సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోయే వరకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులను నిర్వీర్యం చేసే కుట్రలను యువత అప్రమత్తంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక నాయకులు ఎం. రాఘవాచారి, జి. లక్ష్మణ్, ముదునూరు లక్ష్మీనారాయణ, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు పాత్కుల శ్రీశైలం, బాల కిష్టయ్య, డిటిఎఫ్ (DTF) నాయకులు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నాయకులు చందునాయక్, బిఆర్‌ఎస్ (BRS) నాయకులు నాగయ్య, జంగయ్య మిత్రులు మరియు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com