అచ్చంపేట 18వ వార్డులో ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మార్నింగ్ వాక్ | Achampet News

14, Jul 2026 Achampet 176 Views
MLA Dr Chikkudu Vamshi Krishna Conducts Morning Walk in Achampet Town

అచ్చంపేట 18వ వార్డులో ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మార్నింగ్ వాక్.. ప్రజా సమస్యల ప్రత్యక్ష పరిశీలన

అచ్చంపేట: అచ్చంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అచ్చంపేట ఎమ్మెల్యే, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పట్టణంలోని 18వ వార్డులో ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ‘మార్నింగ్ వాక్’ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి వీధిలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. అచ్చంపేట పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామన్నారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో నేరుగా తెలుసుకుని, వాటిని తక్షణమే పరిష్కరించే లక్ష్యంతోనే ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా సహకారంతో అచ్చంపేట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: Achampet News, Achampet MLA Vamshi Krishna, Dr Chikkudu Vamshi Krishna, Achampet Morning Walk, Ward 18 Achampet, Public Issues Achampet, Achampet Development, Nagarkurnool News, Municipal Development, Roads Drainage Drinking Water, Congress Achampet, Model Constituency, Telangana Political News, Achampet Local News, Achampeta News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com