ఆగస్టు 10న జైలు భరో: కేంద్ర విధానాలపై పోరుకు రైతు సంఘం, సిఐటియు పిలుపు

05, Aug 2026 Achampet 176 Views
Rythu Sangham District President L Deshya Naik and CITU leaders releasing Jail Bharo pamphlets with civil supply workers in Achampet

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం: రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేశ్యా నాయక్

అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించనున్న 'జైలు భరో' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్. దేశ్యా నాయక్ పిలుపునిచ్చారు.

అచ్చంపేట పట్టణంలోని సివిల్ సప్లైస్ గోదాం వద్ద కార్మికులతో కలిసి ఈ జైలు భరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశ్యా నాయక్ మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్రం నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం దారుణమని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు కనీస వేతనం ₹26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు లాభాలు చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం రోజువారీ కనీస వేతనాన్ని ₹175గా నిర్ణయించిందని, పని గంటలను పెంచి సంపద సృష్టికర్తలైన కార్మికులపై తీవ్రమైన భారం మోపుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ, స్కీమ్ వర్కర్లకు పని భారం పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే కార్మిక వర్గ పోరాటాలకు తలవంచక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కార్యదర్శి రాములు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధన్ సైదులు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి శంకర్, సివిల్ సప్లైస్ గోదాం కార్యదర్శి జంగయ్య, రాము, వెంకటయ్య, తిరుపతయ్య, బక్కయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Achampet, Achampet News, Deshya Naik, L Deshya Naik, Rythu Sangham, Farmers Union, Jail Bharo, Jail Bharo August 10, Quit India Movement, Labour Protest, Labour Codes, Four Labour Codes, Minimum Wage 26000, Civil Supplies Godown Achampet, CITU, Workers Rights, Farmers Protest, Nagarkurnool News, Telangana News, Labour News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com