అచ్చంపేట ఆనంద్ బార్‌లో అక్రమ వసూళ్లు | Excise Department Complaint | Achampet News

31, May 2026 Achampet 176 Views
Customers protesting against extra charges at Ananda Restaurant and Bar in Achampet.

అచ్చంపేట 'ఆనంద్' బార్‌లో దోపిడీ.. ఒక్కో బాటిల్‌పై రూ. 200 అదనపు వసూలు!

అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని ఆనంద రెస్టారెంట్ అండ్ బార్‌లో కస్టమర్ల జేబులకు చిల్లులు పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లపై భారీగా అదనపు వసూళ్లు చేస్తున్నట్లు కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఒక్కో బ్రాండ్‌పై 100 నుండి 200 రూపాయల వరకు ఎక్స్‌ట్రా ఛార్జ్ వసూలు చేస్తూ యజమాన్యం దోపిడీకి తెరలేపిందని వాపోతున్నారు.

ప్రశ్నిస్తే 'నా ఇష్టం' అంటూ దురుసు ప్రవర్తన: అదనపు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన కస్టమర్లపై బార్ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. "నా ఇష్టం.. నన్ను ప్రశ్నించడానికి మీరెవరు?" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్‌పీ (MRP) కంటే ఎక్కువ ధరకు విక్రయించడం చట్టరీత్యా నేరమని తెలిసినా, నిర్వాహకులు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్సైజ్ శాఖ స్పందన: ఈ అక్రమ వసూళ్లపై బాధిత కస్టమర్లు ఎక్సైజ్ శాఖ ఎస్ఐకి చరవాణి ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ స్పందిస్తూ.. త్వరలోనే బార్‌ను విజిట్ చేసి తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఆనంద రెస్టారెంట్ అండ్ బార్‌పై నిరంతర నిఘా ఉంచి, లైసెన్స్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.

TAGS: Achampet News, Anand Restaurant and Bar, Achampet Bar News, MRP Violation News, Extra Charges on Liquor, Excise Department Telangana, Achampet Latest News, Nagarkurnool News, Bar Overcharging Complaint, Liquor Price Issue, Customer Complaint Achampet, Telangana Excise News, Bar Inspection News, Achampet Local News, Consumer Rights News

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com