నిరుపయోగం లో మినీ వాటర్ ట్యాంక్స్ .. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!

29, Apr 2026 Achampet 176 Views
Dysfunctional mini water tank in the 20th ward of Achampet municipality.

నిరుపయోగం లో మినీ వాటర్ ట్యాంక్స్ .. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!

అచ్చంపేట: మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ప్రజా అవసరాల పట్ల అధికారులు చూపుతున్న నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు మరియు గృహ అవసరాల కోసం గతంలో ఏర్పాటు చేసిన మినీ వాటర్ ట్యాంక్ నేడు నిరుపయోగంగా మారడంతో వార్డు వాసులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్సవ విగ్రహాలుగా మారిన వాటర్ ట్యాంకులు: గత ప్రభుత్వ హయాంలో అప్పటి కమిషనర్, మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వార్డుల్లో మినీ వాటర్ ట్యాంక్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఈ ట్యాంకుల నిర్వహణను గాలికి వదిలేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వార్డుల మండిపడుతున్నారు.

కేవలం ఓట్ల కోసమే రాజకీయాలు చేసే నాయకులకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని వార్డు ప్రజలు హెచ్చరించారు. ఓట్ల సమయంలో వచ్చే నాయకులు, గెలిచిన తర్వాత కనీస అవసరాలైన తాగునీటి సమస్యను కూడా పరిష్కరించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మినీ వాటర్ ట్యాంకును పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

TAGS: Achampet water problem, Achampet mini water tanks problem in ward, drinking water issue Achampet, mini water tank problem, Achampet municipality news, water shortage Achampet, Achampet local news, Achampet ward news, public issues Achampet, Nagarkurnool news, Achampet News, Water Problem in Ward, Drinking Water Issue, Achampet Municipality News, Public Problems, Telangana News, Nagarkurnool News, Achampet Local News

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి
Health

ఉప్పరిపల్లిలో 80వ స్వాతంత్ర్య వేడుకలు | పాల్గొన్న సర్పంచ్ బొజ్జ గీతా రెడ్డి, అమరేందర్ రెడ్డి

15, Aug 2026 Views
వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
Health

వటవర్లపల్లి ఉప సర్పంచ్‌ బండ బాలరాజుకు ఘన సన్మానం | విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

15, Aug 2026 Views
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి
Health

నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య వేడుకలు | ఆవిష్కరించిన జి. చిన్నారెడ్డి

15, Aug 2026 Views
అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం | జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

14, Aug 20261 Views
అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ
Health

అచ్చంపేట యాదవ సంగం కమిటీ హాల్ వద్దా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు | జాతీయ జెండా ఆవిష్కరణ

14, Aug 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com