అచ్చంపేట: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న 'జైల్ భరో' కార్యక్రమాన్ని అచ్చంపేట నియోజకవర్గంలో విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎల్. దేశ్యా నాయక్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం అచ్చంపేటలోని సీఐటీయూ (CITU) కార్యాలయంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో దేశ్యా నాయక్ మాట్లాడుతూ.. కార్మికులు సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రోజువారీ పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ యాజమాన్యాలకు స్వేచ్ఛనిచ్చారని, సమ్మె చేసే హక్కును కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 మందిలోపు కార్మికులు పనిచేసే కంపెనీల్లో ఎప్పుడైనా ముందస్తు నోటీసు లేకుండా తొలగించేలా కొత్త చట్టాలు తెచ్చారని మండిపడ్డారు.
మరొకవైపు ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి చట్టాన్ని నీరుగారుస్తున్నారని, అలాగే పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరిట రైతాంగాన్ని నష్టపరుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చేపట్టే జైల్ భరోను జయప్రదం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం అచ్చంపేట మండల కార్యదర్శి వర్ధం సైదులు, అమ్రాబాద్ మండల కార్యదర్శి మల్లేష్, లింగాల, బల్మూర్ మండల కార్యదర్శి శంకర్ నాయక్, సీఐటీయూ టౌన్ సెక్రటరీ రాములు, ఉప్పునుంతల మండల కార్యదర్శి నాగరాజు, గోపాల్, రవి, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com