అచ్చంపేట / మెదక్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో రాత్రికి రాత్రే గుర్తుతెలియని వ్యక్తులు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కూల్చివేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక అయిన సాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంస ఘటనను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) తీవ్రంగా ఖండించింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను ప్రభుత్వం తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేసింది.
అచ్చంపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్‌పీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ నారామోని నరేష్ యాదవ్ మాట్లాడుతూ.. బహుజనుల ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయడమే కాకుండా, బడుగు బలహీన వర్గాల మహాపురుషుల విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. రజాకారుల వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటం, వెట్టి చాకిరి విముక్తి కోసం అసువులు బాసిన బహుజన ముద్దుబిడ్డ విగ్రహాన్ని కూల్చడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనులు చైతన్యవంతులు అవుతుండటాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని, దీనికి బీసీలంతా ఏకమై తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ బల్మూరు మండల అధ్యక్షుడు అమరేందర్ గౌడ్, అచ్చంపేట టౌన్ ప్రెసిడెంట్ ముద్దముల్ల నిరంజన్, టౌన్ జనరల్ సెక్రటరీ మదునాగుల రమేష్ తదితరులు పాల్గొని ప్రభుత్వానికి, పోలీసు శాఖకు హెచ్చరికలు జారీ చేశారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com