సాయి నగర్ కాలనీ సమస్యలు - వీధి దీపాలు, రోడ్ల దుస్థితిపై కాలనీ వాసుల ఆగ్రహం

26, Mar 2026 Achampet 176 Views
Dark streets and overgrown bushes on dirt roads in Sai Nagar Colony

సాయి నగర్ కాలనీలో తీరని సమస్యలు: వీధి దీపాలు లేవు.. రోడ్లు కనిపించవు.. అధికారుల నిర్లక్ష్యంపై కాలనీ వాసుల ఆగ్రహం!

అచ్చంపేట: స్థానిక సాయి నగర్ కాలనీలో సమస్యలు తిష్ట వేశాయి. గత రెండు రోజులుగా కాలనీ మొత్తం పరిశీలించగా చాలా చోట్ల వీధి దీపాలు వెలగడం లేదని, దీనివల్ల రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫోటోలకే పరిమితమైన నాయకులు: సమస్యల పరిష్కారం కోసం ఎవరో ఒకరు చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి పనులు చేయిస్తుంటే, కాలనీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులూ మధ్యలో వచ్చి ఫోటోలు దిగి వెళ్లడం తప్ప నిజాయితీగా పనిచేయడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని వారు మండిపడుతున్నారు.

దారి మూసుకుపోయిన మట్టి రోడ్లు: కాలనీలో ఉన్న కొన్ని మట్టి రోడ్ల పైన పిచ్చి మొక్కలు, చెట్లు గుబురుగా పెరిగిపోయి దారి కనిపించకుండా పోయింది. నడవడానికి కూడా వీలు లేకుండా రోడ్లు మూసుకుపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని నిరసిస్తున్నారు. "మేము ఇంటి పన్ను, నల్ల పన్నులు క్రమం తప్పకుండా కడుతున్నాం. మరి మా కాలనీని ఎందుకు ఇంత దారుణంగా వదిలేశారు?" అని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. అసలు తమ కాలనీ మున్సిపల్ పరిధిలో ఉందో లేక గ్రామ పంచాయతీ పరిధిలో ఉందో అర్థం కావడం లేదని వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు.

TAGS: Sai Nagar Colony Achampet issues, Achampet street lights problem, Achampet road condition bad colony, Nagarkurnool municipal negligence news, Telangana urban issues street lights roads, Achampet residents protest civic issues, Sai Nagar colony infrastructure problem, Achampet sanitation and road maintenance issues, Telangana local governance failure news, Achampet colony development issues
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com