విత్తన కమీషన్ సక్సెస్ - 1875 మంది రైతులకు గుడ్ న్యూస్!
జిల్లాలో ముగిసిన విత్తన ప్రక్రియ.. పారదర్శకంగా ఎంపిక.
నాణ్యమైన విత్తనాలే లక్ష్యం - వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు.
30 మండలాలు.. 15 క్లస్టర్లు.. నాగర్‌కర్నూలు అగ్రి అప్‌డేట్.
నాగర్‌కర్నూలు: జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన కమీషన్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ముగిసింది. జిల్లాలోని మొత్తం 30 మండలాల్లో ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ యశ్వంత్ రావు తెలిపారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా 15 క్లస్టర్లలో ఈ కమీషన్ నిర్వహించారు. ప్రతి క్లస్టర్‌లో 125 మంది రైతులను నమోదు చేయగా, మొత్తం 1875 మంది రైతులు ఈ ప్రక్రియ ద్వారా లబ్ధి పొందనున్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో విత్తనాల ఎంపిక జరిగింది. పంపిణీ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని యశ్వంత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వ్యవసాయ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com