కొండారెడ్డిపల్లి అభివృద్ధిపై కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సమీక్ష | Nagarkurnool News

30, May 2026 Achampet 176 Views
Collector Hemant Keshav Patil review meeting in Kondareddypally.

జూన్ నెలాఖరులోపు కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనులు పూర్తి కావాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్/వంగూరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన వంగూరు మండలం కొండారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం గ్రామంలో జరుగుతున్న వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ దేవ సహాయం, ఆర్డీవో జనార్దన్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామంలో జరుగుతున్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, రహదారులు, డ్రైనేజీ పనులను జూన్ నెలాఖరులోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు.

నాణ్యత విషయంలో కఠిన హెచ్చరికలు: అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని కలెక్టర్ హెచ్చరించారు. నాసిరకం పనులు జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని, ప్రతి పని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, శాఖల మధ్య సమన్వయం లోపించకుండా పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, పనుల పురోగతిపై ప్రతిరోజూ నిఘా ఉంటుందని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

TAGS: Nagarkurnool News, Vangoor News, Kondareddypalli News, Collector Hemanth Keshav Patil, Revanth Reddy Village, Model Village Development, Kondareddypalli Development Works, Vangoor Mandal News, Nagarkurnool District News, Telangana Development News, Roads and Drainage Works, Anganwadi Centre Development, School Development News, Rural Infrastructure News, Telangana Government Projects

 

Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com