రేపు అచ్చంపేటలో మీనాక్షి నటరాజన్ పర్యటన - కూలీలతో ముఖాముఖి.
బుడ్డ తండాలో కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సందడి.
ఉపాధి కూలీల సమస్యలపై మీనాక్షి నటరాజన్ ఆరా.. ఎమ్మెల్యే ఏర్పాట్ల తనిఖీ.
అచ్చంపేటలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన - రాజకీయ ప్రాధాన్యత.
అచ్చంపేట: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఫిబ్రవరి 2వ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10:00 గంటలకు అచ్చంపేట మండలం బుడ్డ తండా గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ఆమె నేరుగా సమావేశమై, వారి సమస్యలపై ముఖాముఖి చర్చించనున్నారు.
ఈ పర్యటన ఏర్పాట్లలో భాగంగా, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారితో కలిసి బుడ్డ తండాలో ఉపాధి కూలీల సమావేశ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కూలీల కష్టాలను తెలుసుకునేందుకు మీనాక్షి నటరాజన్ గారు వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com