ఉప్పునుంతల (మామిళ్ళపల్లి): ఉప్పునుంతల మండలం మామిళ్ళపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే గారికి ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, భోజన వసతి మరియు ఇతర సౌకర్యాలలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించి, ఉత్సవాల నాటికి పనులన్నీ పూర్తి చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో (EO) నర్సింలు, సర్పంచ్ మొకురాల మోహన్ గౌడ్, మండల ప్రజాప్రతినిధులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Uppununthala (Mamillapally): Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna held a high-level review meeting to discuss the arrangements for the upcoming annual Brahmotsavams of Sri Lakshmi Narasimha Swamy temple in Mamillapally. Upon his arrival, Temple Committee Chairman Vemula Narasimha Rao welcomed the MLA, followed by a special 'Pooja' performed by Vedic priests.
Addressing the officials, the MLA stated that the Brahmotsavams will be celebrated from February 28 to March 5. He directed the concerned departments to ensure seamless arrangements for drinking water, electricity, food, and sanitation for the thousands of visiting devotees. He also inspected the ongoing development works at the temple premises and instructed the committee to speed up the process. Temple EO Narsimlu, Sarpanch Mokurala Mohan Goud, and other local leaders participated in the meeting.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com