అచ్చంపేట: అచ్చంపేట పట్టణంలోని సాయి నగర్ కాలనీ, సాయిరాం టాకీస్ ఎదురుగా నివసిస్తున్న ప్రజలు గత కొంతకాలంగా తీవ్రమైన లో-వోల్టేజ్ (Low Voltage) సమస్యతో అల్లాడుతున్నారు. కరెంటు వోల్టేజ్ చాలా తక్కువగా ఉండటంతో ఇళ్లలోని బోరు మోటర్లు కూడా నడవక తాగునీటి కోసం కాలనీవాసులు నానా అవస్థలు పడుతున్నారు.
ముఖ్యంగా సాయంత్రం వేళల్లో కనీసం లైట్లు కూడా వెలగని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లో-వోల్టేజ్ కారణంగా ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు వంటి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోతున్నాయని వారు ఫిర్యాదు చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులకు విజ్ఞప్తి: ఈ సమస్యపై స్థానిక ప్రజాప్రతినిధులు మరియు విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఇక్కడ అదనపు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి లేదా ఉన్న లైన్లను సరిచేసి లో-వోల్టేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Achampet: Residents of Sai Nagar Colony, located opposite Sairam Talkies in Achampet town, have been facing persistent low voltage problems. The power supply is so weak that borewell motors are failing to function, leading to a severe water shortage in the locality.
According to local residents, the voltage levels drop significantly, especially during peak hours, making it impossible to use essential household appliances. Many have reported damage to electronic equipment like refrigerators and televisions due to the inconsistent power supply.
Appeal to Authorities: The colony residents are urging local representatives and the electricity department (TGSPDCL) officials to look into the matter immediately. They have requested the installation of an additional transformer or a technical upgrade to the existing lines to ensure stable voltage and prevent further inconvenience.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com