లింగాల (అంబటిపల్లి): భూభారతి పథకంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమంపై లింగాల మండలం అంబటిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో జాయింట్ కలెక్టర్ అమరేందర్, జిల్లా సర్వేయర్ మరియు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఇంచు భూమిని సర్వే చేయడం వల్ల భూముల సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించబడతాయని, దీనివల్ల భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని తెలిపారు. రైతులు మరియు భూ యజమానులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రైతులందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, సర్వే అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Land Resurvey Will Provide Permanent Solutions to Land Disputes: MLA Dr. Chikkudu Vamsi Krishna
Lingala (Ambatipalli): As part of the 'Bhu Bharati' scheme, an awareness program on land resurvey was held at Ambatipalli Gram Panchayat in Lingala Mandal. Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna attended as the chief guest, alongside Joint Collector Amarender and the District Surveyor.
Speaking at the event, the MLA emphasized that the resurvey would use modern technology to accurately mark boundaries for every inch of land, significantly reducing land-related litigations. He encouraged farmers and landowners to clear their doubts with the visiting survey teams and cooperate with the officials. He stated that the government's goal is to ensure a dispute-free land record system. Tahsildars, Revenue officials, and local farmers participated in the session.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com