దోమలపెంట: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని దోమలపెంట రేంజ్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వటవర్లపల్లి మరియు ఈగలపెంట బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎండల తీవ్రత మరియు పొడి గడ్డి కారణంగా మంటలు వేగంగా విస్తరించాయి.
అదుపులోకి మంటలు: సమాచారం అందిన వెంటనే రేంజ్ అధికారి (RFO) పర్యవేక్షణలో అటవీ బీట్ అధికారులు, శిక్షణా అధికారులు, ఫైర్ వాచర్లు మరియు బేస్ క్యాంప్ సిబ్బంది రంగంలోకి దిగారు. సాహసోపేతంగా శ్రమించి మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. సుమారు 30 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫైర్ సంభవించినప్పటికీ, కేవలం పొడి గడ్డి మాత్రమే కాలిందని, చెట్లు లేదా వన్యప్రాణులకు ఎటువంటి నష్టం కలగలేదని అధికారులు ధృవీకరించారు.
దర్యాప్తు ప్రారంభం: ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది? ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా? అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అటవీ ప్రాంతంలో నిప్పు రాజేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Ground Fire in Domalapenta Range: 30 Hectares of Grass Burnt; Forest Staff Control Blaze
Domalapenta: A fire broke out in the Nallamala forest region under the Domalapenta Range on Wednesday afternoon. The blaze started around 3:00 PM within the beats of Vatavarlapally and Eegalapenta.
Swift Action by Forest Teams: Under the direct supervision of the Range Forest Officer (RFO), forest beat officers, probationary officers, fire watchers, and base camp staff immediately rushed to the spot. Their timely intervention prevented a major disaster. Officials reported that the "ground fire" affected approximately 30 hectares of land. Fortunately, the damage was limited to dry grass, and no trees or wildlife were harmed in the incident.
Investigation Underway: The Forest Department has launched an investigation to ascertain the cause of the fire and to identify if any human activity was responsible. Officials have warned of strict legal action against anyone found causing forest fires.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com