247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

17, Jul 2026 Achampet 176 Views
Deputy CM Bhatti Vikramarka Distributes Appointment Letters to 247 Nursing Officers

నూతన నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ (IMS) ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు హైదరాబాద్‌లోని సేవాలాల్ భవన్‌లో నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ వేడుకలో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వైద్యం, విద్యారంగాలపై ప్రభుత్వం చేసే ఖర్చు ఉచిత సంక్షేమం కాదని, అది రాష్ట్ర భవిష్యత్తును మార్చే మానవ వనరులపై పెట్టే దీర్ఘకాలిక పెట్టుబడి అని స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన సమాజమే బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాది అని ఆయన అభివర్ణించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత పారదర్శక విధానంలో రికార్డు స్థాయిలో 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు భరోసా కల్పించామని గుర్తుచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యంగా కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు ఈఎస్ఐ (ESI) ఆసుపత్రులను అత్యాధునిక వైద్య సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. నూతనంగా విధుల్లోకి చేరుతున్న నర్సింగ్ ఆఫీసర్లు సేవాభావంతో ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: Telangana Nursing Officers Jobs, 247 Nursing Officers Appointments, Nursing Officer Appointment Letters, Hyderabad Nursing Jobs, IMS Department Telangana, Insurance Medical Services Telangana, Bhatti Vikramarka, Telangana Deputy CM, Gaddam Vivek Venkataswamy, Nursing Officer Recruitment Telangana, Telangana Government Jobs, ESI Hospitals Telangana, Telangana Health Department, Nursing Officers Telangana, Sevalal Bhavan Hyderabad, Telangana Healthcare News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com