అచ్చంపేట: నల్లమల ప్రాంత క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా అచ్చంపేట రాజీవ్-ఎన్టీఆర్ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న 'సీవీకే (CVK) కప్ ఆల్ ఇండియా లెవెల్ క్రికెట్ టోర్నమెంట్' నేడు విజయవంతంగా ముగిసింది. సీజన్-3లో భాగంగా నిర్వహించిన ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మరియు అనుష ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అండపల్లి జలంధర్ రెడ్డి గారు వీక్షించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
విజేతల వివరాలు:
ప్రథమ బహుమతి: మొరుగు రమేష్ రెడ్డి (అన్నారం జట్టు) - రూ. 5,00,000 నగదు మరియు షీల్డ్.
ద్వితీయ బహుమతి: బళ్లారి జట్టు - రూ. 3,00,000 నగదు మరియు షీల్డ్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ, నల్లమల ప్రాంతంలో క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో స్టేడియంను మరిన్ని హంగులతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వివిధ కమిటీల చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు టోర్నమెంట్ నిర్వాహకులు కటకం రఘురాం, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Achampet: The week-long CVK Cup All India Level Cricket Tournament (Season 3) concluded on a grand note at the Rajiv-NTR Stadium in Achampet. Achampet MLA Dr. Chikkudu Vamsi Krishna, along with Jalandhar Reddy of Anusha Projects Pvt Ltd, attended the final match and encouraged the players.
Tournament Winners:
Winners: Annaram Team (Morugu Ramesh Reddy) bagged the ₹5,00,000 first prize.
Runners-up: Bellary Team secured the ₹3,00,000 second prize.
Speaking at the presentation, Dr. Vamsi Krishna emphasized the "People's Government's" commitment to promoting sports in the Nallamala region. He stated that the vision is to see local talent represent India on international platforms. He thanked the organizers, including Katakam Raghuram and the management team, for the flawless execution of the event.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com