మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ బాదావత్ సంతోష్ సీరియస్.. హెడ్ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు

09, Mar 2026 Achampet 176 Views
Nagarkurnool Collector Badavath Santosh Inspects Mid-Day Meals; Issues Show-Cause Notices

నాసిరకం భోజనంపై కలెక్టర్ ఆగ్రహం.. హెడ్ మాస్టర్, ఫుడ్ చెకింగ్ టీచర్‌పై చర్యలకు ఆదేశం

నాగర్ కర్నూల్ (మార్చి 9, 2026): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్పష్టం చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ప్రభుత్వ మెనూ ప్రకారం కిచిడీ, మిక్స్‌డ్ వెజిటేబుల్ కర్రీ అందించాల్సి ఉండగా, కేవలం వైట్ రైస్, సాంబార్ మాత్రమే వడ్డించడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్నం సరిగా ఉడకలేదని, సాంబార్ నాణ్యత అత్యంత నాసిరకంగా ఉందని సిబ్బందిపై మండిపడ్డారు. "జిల్లాలో ఎన్నో పాఠశాలలు చూశాను కానీ, ఇంత అధ్వాన్నమైన భోజనం ఎక్కడా చూడలేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించిన హెడ్‌మాస్టర్ భాస్కర్ రెడ్డి, ఫుడ్ చెకింగ్ టీచర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈఓ రమేష్ కుమార్‌ను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అనంతరం ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్న 128 మంది విద్యార్థులతో కలెక్టర్ సమావేశమయ్యారు. భయం లేకుండా పరీక్షలు రాసి 100% ఉత్తీర్ణత సాధించాలని వారిని ప్రోత్సహించారు. ప్రీ ఫైనల్ మార్కుల వెల్లడిలో జాప్యంపై ఉపాధ్యాయులను నిలదీశారు.

TAGS:Badavath Santosh Collector, Nagarkurnool District Collector Badavath Santosh, Nagarkurnool ZP Girls High School news, mid-day meal quality issue Nagarkurnool, Telangana mid day meal scheme inspection, Collector surprise visit school Nagarkurnool, DEO Ramesh Kumar notice, Headmaster Bhaskar Reddy show cause notice, Telangana school mid day meal issue, Nagarkurnool education department news, Telangana school inspection news, students nutrition issue Telangana, Nagarkurnool district news
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com