హర్ ఘర్ తిరంగాను విజయవంతం చేయాలి: బిజెపి నాగర్‌కర్నూల్ జిల్లా పదాధికారుల సమావేశం

05, Aug 2026 Achampet 176 Views
BJP Nagarkurnool district office-bearers meeting addressed by N Gautham Rao, Guvvala Balaraju, and Vemula Narender Rao

'హర్ ఘర్ తిరంగ'ను విజయవంతం చేయాలి: బిజెపి నాగర్‌కర్నూల్ జిల్లా పదాధికారుల సమావేశంలో నాయకుల పిలుపు

నాగర్‌కర్నూల్: జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు అధ్యక్షతన నాగర్‌కర్నూల్ జిల్లా బిజెపి పదాధికారుల సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతం రావు, 'హర్ ఘర్ తిరంగ' రాష్ట్ర కో-కన్వీనర్ కట్ట సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్, జిల్లా ఇంచార్జి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగేందర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, నరసింహలతో పాటు వివిధ మోర్చాల రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గౌతం రావు, కట్ట సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 15న నిర్వహించే 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బిజెపి పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలు (BLA-2) సంబంధిత బిఎల్ఓ (BLO)లతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలోని అన్ని మోర్చాలు కలిసికట్టుగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని స్పష్టం చేశారు. అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా నియమితులైన వివిధ మోర్చాల అధ్యక్షులను సీనియర్ నాయకులు సన్మానించారు.

Tags: Nagarkurnool, Nagarkurnool News, BJP Nagarkurnool, Har Ghar Tiranga, Har Ghar Tiranga 2026, Vemula Narendra Rao, N Gautam Rao, Katta Sudhakar Reddy, Guvvala Balaraju, Solanki Srinivas, BJP District Meeting, BJP Leaders Meeting, Tiranga Campaign, Independence Day 2026, Voter List Revision, BLO, BLA 2, Telangana BJP, Telangana News, Political News
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com