అచ్చంపేట అభివృద్ధికి పెద్దపీట: మన్ననూర్‌లో భారీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
అచ్చంపేట / అమ్రాబాద్: తెలంగాణలో పుట్టడమే అదృష్టంగా భావించేలా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో రూ.53.78 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 220/30 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అచ్చంపేట ప్రాంతంతో తనకు 1980 నుంచి సుమారు 46 ఏండ్ల సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గతంలో విద్యుత్ సమస్యలతో అల్లాడిన ఈ ప్రాంతానికి, విద్యుత్ శాఖ బాధ్యతలు తన వద్ద ఉండటంతో శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే రూ.75 కోట్లతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, పంపిణీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశామన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
అచ్చంపేటను కేవలం ఒక నియోజకవర్గంగా కాకుండా భవిష్యత్తులో ప్రధాన జంక్షన్ (రవాణా కూడలి) గా మారుస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని సహజసిద్ధ వనరులను ఉపయోగించుకుంటూ సుమారు 500 ఎకరాల్లో పీపీపీ విధానంలో 'ఎకో టూరిజం' ప్రాజెక్టును ఏర్పాటు చేసి, స్థానిక యువతకు, గిరిజనులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అచ్చంపేటలో ఎస్పీడీసీఎల్ (SPDCL) డివిజన్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే జీఓ జారీ చేసిందని గుర్తుచేశారు.
గత మూడేళ్లలో ప్రజా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా రూ.1,64,431 కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని తెలిపారు. కోటి 6 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ, 1.15 కోట్ల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వైద్య భరోసా, 43 లక్షల మందికి చేయూత పింఛన్లు, 71.40 లక్షల మంది రైతులకు రైతు భరోసా, 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి రూ.90 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో అచ్చంపేట నియోజకవర్గంలో విద్యుత్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని, కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుతో రైతన్నలకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com