అమ్రాబాద్ మండలాన్ని కరువు మండలముగా ప్రకటించాలి: సీపీఎం డిమాండ్

13, Oct 2026 Achampet 176 Views
CPM leaders inspecting dried cotton crops in Amrabad mandal due to drought

అమ్రాబాద్ మండలాన్ని కరువు మండలముగా ప్రకటించాలి: సీపీఎం పార్టీ డిమాండ్

అమ్రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు పడక అమ్రాబాద్ మండలంలో పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయాయని, తక్షణమే అమ్రాబాద్ మండలాన్ని కరువు మండలముగా ప్రకటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సీపీఎం) డిమాండ్ చేసింది. సీపీఎం ఆధ్వర్యంలో అమ్రాబాద్ మండలంలోని కల్మలోనిపల్లి గ్రామంలో ఎండిపోయిన పత్తి పంటలను నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఎస్. మల్లేష్, సీఐటీయూ జిల్లా నాయకులు జి. పర్వతాలు మాట్లాడారు. వర్షాలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా వర్షాలు బాగా పడితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పత్తి, ప్రస్తుతం కేవలం 2 నుంచి 3 క్వింటాళ్లు మాత్రమే వస్తోందని వాపోయారు. కష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరాకు రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో అమ్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి సీహెచ్. బాలయ్య, ఎన్. చెన్నకిష్టయ్య, పి. బాలకృష్ణయ్య, ఎన్. పర్వతాలు, ఏ. మధు, ఎం. పృథ్వి రాజు, దాసరి బాలస్వామి, ఎన్. శంకరయ్య, కే. జనార్ధన్, కే. కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: Amrabad, Amrabad News, Amrabad Drought, Amrabad Drought Declaration, Cotton Crop Damage, Amrabad Cotton Farmers, El Nino Effect, Cotton Crop Loss, Farmers Compensation, Drought Mandal, CPM Amrabad, CPI(M) Telangana, CPM Protest, Amrabad Farmers, Kalmalonipally, Nagarkurnool District, Telangana Agriculture, Cotton Farmers Telangana
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com