అచ్చంపేట: అప్ప శివ జ్యూవెలర్స్ ప్రతిభ అవార్డులు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

23, May 2026 Achampet 176 Views
Achampet MLA Dr. Chikkudu Vamsikrishna handing over a ₹20,000 cash prize check and merit award memento to a 10th-grade topper at Ambedkar Chowrastha during the Appa Shiva Jewellers function.

విద్యార్థులకు ‘అప్ప శివ జ్యూవెలర్స్’ ప్రతిభ అవార్డులు.. విజేతలకు నగదు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ!

అచ్చంపేట: పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నియోజకవర్గ విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్థానిక అప్ప శివ జ్యూవెలర్స్ అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అప్ప శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెన్త్ క్లాస్ టాపర్స్ ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నగదు బహుమతులు మరియు ప్రతిభ అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా మొదటి బహుమతి కింద రూ. 20,000, ద్వితీయ బహుమతిగా రూ. 10,000, మరియు తృతీయ బహుమతిగా రూ. 5,000 నగదును ప్రతిభావంతులకు పంపిణీ చేశారు. అలాగే 10వ తరగతిలో 400 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులందరికీ ప్రతిభ అవార్డులతో పాటు జ్ఞాపికలను (మెమొంటోలను) అందజేసి ఘనంగా సత్కరించారు.

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. వెనుకబడిన నల్లమల ప్రాంతం నుంచి అప్ప శివ ముందుకు వచ్చి, పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఇలా భారీ మనీ ప్రైజ్ లతో పాటు ప్రతిభ అవార్డులను అందించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. నియోజకవర్గంలోని పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. అప్ప శివ భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందజేస్తోందని, ప్రజా పాలనలో విద్యకే మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ ఘనమైన సేవా కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మేధావులు, పట్టణ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TAGS: Achampet News, Appa Shiva Jewellers, Talent Awards Program, 10th Class Toppers, Chikkudu Vamsi Krishna, Student Awards Telangana, Cash Prizes for Students, Achampet MLA, Education Encouragement Program, Ambedkar Chowrasta Achampet, Telangana Education News, Merit Awards Ceremony, Nallamala Students, Congress Government Education, Revanth Reddy Education Focus, Student Felicitation Program, SSC Toppers Awards, Achampet Students, Educational Support Telangana, Talent Recognition Awards
Jk Building Water Proofing Achampet

Swetha CT Scanning Center Achampet

Master-minds-Junior-college-achampet

Kishan deva Milk Center Achampet

 
Subscribe Newsletter

It is a long established fact that a reader will be distracted.

Latest Posts

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ
Health

బల్మూర్ మండలం నర్సాయిపల్లిలో కామ్రేడ్ చందు స్మారక స్థూపం ఆవిష్కరణ

18, Oct 2026 Views
ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana
Health

ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘం కీలక సమావేశం | BC Association Meeting Telangana

18, Oct 2026 Views
అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna
Health

అచ్చంపేటలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ | MLA Vamsi Krishna

18, Oct 2026 Views
అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ
Health

అచ్చంపేట టీచర్స్ కాలనీ దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

18, Oct 2026 Views
అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division
Health

అచ్చంపేటకు విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయం మంజూరు | Achampet Electricity Division

18, Oct 2026 Views
అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి
Health

అచ్చంపేట మండలం బొమ్మనపల్లిలో కరెంట్ షాక్‌తో జీపీ వర్కర్ మృతి

17, Oct 2026 Views

List your business for FREE

Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."

Add my business arrow_forward

Copyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com