ఉప్పునుంతల, నాగర్ కర్నూల్: దైవ చింతనతో కూడిన పాలన, ప్రజా క్షేమమే పరమావధిగా అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యులు డా. చిక్కుడు వంశీకృష్ణ ముందుకు సాగుతున్నారు. ఉప్పునుంతల మండలం, మామిళ్ళపల్లి గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యే తన సతీమణి డా. చిక్కుడు అనురాధమ్మ గారితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రాజకీయాలకే పరిమితం కాకుండా, నియోజకవర్గంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమంలోనూ ముందుంటూ మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తున్న డా. చిక్కుడు దంపతుల తీరును స్థానికులు అభినందిస్తున్నారు. అటు వైద్య సేవలు, ఇటు సామాజిక సేవలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్న ఈ దంపతులు, ఆధ్యాత్మిక వారధులుగా నిలుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
It is a long established fact that a reader will be distracted.
Your business can be found in more places than just your own website. Listing on major platforms like Google Business Profile, Yelp, or local directories ensures you show up when customers search for products/services "near me."
Add my business arrow_forwardCopyright © 2025 Achampeta.Com. Proudly powered by Achampeta.com